గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణపాట
ఆడుకోవాలి గువ్వలాగా
పాడుకుంటాను నీ జంట గోరింకనై
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణపాట
♪
జోడుకోసం గోడదూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు
అయ్యోపాపం అంతతాపం తగదులే తమరికి అబ్బాయిగారు
ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం
తూర్పులో నిట్టూర్పులో అంతా నీధ్యానం
కోరుకున్నానని ఆటపట్టించకు
చేరుకున్నానని నన్ను దోచెయ్యకు
చుట్టుకుంటాను సుడిగాలిలా
గువ్వా
గోరింకతో
ఆడిందిలే బొమ్మలాట
నిండు
నా గుండెలో
మ్రోగిందిలే వీణపాట
♪
కొండనాగు తోడుచేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం
సందెకాడ అందగత్తె కొంగులో ఉందిలే ఎంతో సంతోషం
పూవులో మకరందము ఉందే నీకోసం
తీర్చుకో ఆ దాహము వలపే జలపాతం
కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు
దూరముంటానులే దగ్గరయ్యేందుకు
దాచిపెడతాను నా సర్వము
గువ్వా
గోరింకతో
ఆడిందిలే బొమ్మలాట
నిండు
నా గుండెలో
మ్రోగిందిలే వీణపాట
ఆడుకోవాలి గువ్వలాగా
పాడుకుంటాను నీ జంట గోరింకనై
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri