(లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే)
కొండలరాజు బంగరుకొండ
కొండజాతికి అండదండ
మద్దెరాతిరి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే
వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే
(లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే)
మెళ్ళో మెలికల నాగులదండ
వలపుల వేడికి ఎగిరిపడంగా
ఒంటి ఈబూది జల జల రాలిపడంగ సాంబడు కదిలిండే
అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విల విల నలిగిండే
(లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే)
♪
కొర కొర కొరువులు మండే కళ్ళు
జడలిరబోసిన సింపిరికురులు
ఎర్రటి కోపాలెగసిన కుంకమ్ బొట్టు వెన్నెలకాసిందే
పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి సిగ్గులు పూసిందే
ఉభలాటంగా ముందటికురికి
అయ్యవతారం చూసిన కలికి
ఎందా సెంకం సూలం బైరాగేసం ఎందని సనిగిందె
ఇంపుగా ఈపూటైన రాలేవా అని సనువుగా కసిరిందే
(లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే)
♪
లోకాలేలే ఎంతోడైన
లోకువమడిసే సొంతింట్లోన
అమ్మోరి గడ్డం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు
ఆలుమగల నడుమన అడ్డంరావులె ఇట్టాటి నిమాలు
ఒకటోజామున కలిగిన విరహం
రెండోజాముకు ముదిరిన విరసం
సర్దుకుపోయే సరసం కుదిరేయేలకు మూడో జామాయే
ఒద్దిగా పెరిగే నాలుగోజాముకు గుళ్లో గంటలు మొదలయే
(లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లా
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే)
ప్రతి ఒక రోజిది జరిగే గట్టం
యెడముఖమయ్యి ఏకంమవటం
అనాది అలవాటిళ్లకి అలకలలోనే కిలకిలమనుకోటం
స్వయానా చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri