మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం
పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే రావా
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం
పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే రావా
♪
మేఘం నేల ఒళ్ళు మీటే రాగామల్లే
ప్రేమా వరాల జల్లు కావా
పిలుపే అందుకొని బదులే తెలుపుకొని
కౌగిట ఒదిగి ఉండనీవా
నా గుండె కోవెల విడిచి వేళ్ళ తగునా తగునా
మల్లె పూల మాలైనిన్నే వరించి పూజించే వేళా
నిరీక్షించి స్నేహం కోరి, జతనై రానా రానా
ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వెళైనా
నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట
ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం
పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే రావా
♪
పూవై నవ్వులని తేనై మాధురిని
పంచే పాట మన ప్రేమ
విరిసే చంద్రకళ ఎగసే కడలి అల
పలికే కవిత మన ప్రేమ
కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై
వేటాడు ఏ ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై
నూరేళ్ళ కాలం కూడా, ఒక్క క్షణమై క్షణమై
నువ్వూ నేను చేరి సగమౌదాం వయస్సు పండించే వరమై
ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం
తుదే లేని ఆనందం వేచేనే నీకోసం
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదటనె కలవా
దొరికినదే నా స్వర్గం
పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే రా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri