రాసలీల వేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేల
రాసలీల వేళ రాయబారమేల
♪
కౌగిలింత వేడిలో కరిగె వన్నె వెన్నలా
తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల
మోజులన్ని పాడగా జాజి పూల జావళి
కందెనేమొ కౌగిట అందమైన జాబిలి
తేనె వానలోన చిలికె తియ్యనైన స్నేహము
మేని వీణలోన పలికె సోయగాల రాగము
నిదుర రాని కుదురులేని ఎదలలోని సొదలు మాని
రాసలీల వేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేల
రాసలీల వేళ రాయబారమేల
♪
మాయజేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తియ్యని హాయి పూల జల్లులు
చేరదీసి పెంచకు భారమైన యవ్వనం
దోర సిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాన అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఆపలేను కలల తలుపు తియ్యనా
చెలువ సోకు కలువ రేకు కలువ సోకి నిలువనీదు
రాసలీల వేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేల
రాసలీల వేళ
రాయబారమేల
రాసలీల వేళ రాయబారమేల
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri