దేనికో ఏమిటో
దేనికో ఏమిటో
మెల్ల మెల్ల మెల్లగా మెల్లంగా మాయ కమ్ముతున్నదే
చిన్న చిన్న చిన్నగా చిన్నంగా నవ్వు పొంగుతున్నదే
తెలిసిందా నీకు కొంతైనా, వెలిగిందా కొంచెమైనా
జరిగింది జరుగుతుందంతా గమనించి మౌనమేల
తగిలే గాలులైనా, నడిచేటి దారులైనా
చెబుతాయి నీలో మార్పుని
మెల్ల మెల్ల మెల్లగా మెల్లంగా మాయ కమ్ముతున్నదే
చిన్న చిన్న చిన్నగా చిన్నంగా నవ్వు పొంగుతున్నదే
గుండెలోనే దాచుకోకే తొంగిచూసే ఆశని
గొంతులోనే ఆగనీకే తోడుకోరే మాటని
జతలోకి అడుగువేస్తె జగమేమి జారిపోదే
అతగాడి వైపు చూస్తే అది నేరమేమి కాదే
మొదలైంది కొత్త ఉదయం... పదమంది నిన్ను సమయమం
ప్రియ రాగాలేవో పాడగా
మెల్ల మెల్ల మెల్లగా ఊహల్లో మేలుకుంది సంబరం
చిన్న చిన్న చిన్నగా చూపుల్లో తుళ్ళుతుంది సాగరం
తెలిసిందా నీకు కొంతైనా, వెలిగిందా కొంచెమైనా
జరిగింది జరుగుతుందంతా గమనించి మౌనమేల
తగిలే గాలులైనా, నడిచేటి దారులైనా
చెబుతాయి నీలో ప్రేమని
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri