చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండిమబ్బు ఒడిలో
ముద్దు ముచ్చటలాడుకుందాం
చిరుగాలై కొండా కోనల్లోన తేలి
చిరునవ్వై పూలగుండెల్లోన దాగాలి
చిరుగాలై కొండా కోనల్లోన తేలి
చిరునవ్వై పూలగుండెల్లోన దాగాలి
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండిమబ్బు ఒడిలో
ముద్దు ముచ్చటలాడుకుందాం
♪
కడలి అంచుల్లో జలకాలాడి
అలలా అంతూ పొంతూ చూసొద్దామా
యమహొ ముందో ముద్దు లాగిద్దామా
తొణికే వెన్నెల్లో సరసాలాడి
వయసు హద్దు పొద్దు తేలుద్దామా
త్వరగా అస్సు బుస్సు కానిద్దామా
తరగని మోహలే వేసాయి వలలూ
తడి తడి ఒంపుల్లో పిల్లోడా
అరగని అందాలే పొంగాయి సడిలో
పెదవుల తాంబూలం అందీవే
తనువిచ్చేయమంటోంది మనసొద్దద్దంటోంది
ఇక సిగ్గేమంటూ కొమ్మారెమ్మా ఊగాడింది
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో
ముద్దు ముచ్చటలాడుకుందాం
చిరుగాలై కొండా కొనల్లోన తేలి
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో
ముద్దు ముచ్చటలాడుకుందాం
♪
చలిలో చిన్నారి వయ్యారాలే
కసిగా గుచ్చి గుచ్చి ఊరిస్తుంటే
ఉసిగా తట్టి తట్టి వేధిస్తుంటే
వలపుల కౌగిళ్ళ నజరానాలే
రతిలా మళ్ళీ మళ్ళీ అందిస్తుంటే
మరుడే ఒళ్ళోకొచ్చి కవ్విస్తుంటే
తెలియని ఆవేశం రేగిందే మదిలో
తలుపులు తీవేమే బుల్లెమ్మా
పరువపు ఆరాటం తీరాలి జడిలో
తకధిమి సాగించెయ్ బుల్లోడా
ఇహ అడ్డేముందమ్మో మలి ముద్దిచ్చెయవమ్మో
మెరుపల్లే బాణం సంధిచెయ్రా వీరా ధీరా
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో
ముద్దు ముచ్చటలాడుకుందాం
చిరుగాలై కొండా కొనల్లోన తేలి
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి
చిరుగాలై కొండా కొనల్లోన తేలి
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో
ముద్దు ముచ్చటలాడుకుందాం
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri