పవనజ స్తుతి పాత్ర, పావన చరిత్ర
రవిసోమ వరనేత్ర, రమణీయ గాత్ర
సీతా కళ్యాణ వైభోగమే
రామా కళ్యాణ వైభోగమే
శుభం అనేలా అక్షింతలు అలా దీవెనలతో
అటు ఇటు జనం హడావిడి తనం
తుల్లింతల ఈ పెళ్లి లోగిళ్లలో
పదండని బంధువులొక్కటై
సన్నాయిల సందడి మొదలై
తదాస్తని ముడులు వేసే హే
సీతా కళ్యాణ వైభోగమే
రామా కళ్యాణ వైభోగమే
దూరం తరుగుతుంటే, గారం పెరుగుతుంటే,
వణికే చేతులకు గాజుల చప్పుడు చప్పున ఆపుకొని
గడేయగ మరిచిన తలుపే వెయ్యండని సైగలు తెలిపే
క్షణాలిక కరిగిపోవా
(పవనజ స్తుతి పాత్ర)
సీతా కళ్యాణ వైభోగమే
రామా కళ్యాణ వైభోగమే
నిస నిస నిస నిస నిస నిస రిస
పదనిగ రిగ రిపమగ మగరిస
గ గ గ గగ గనిమగ రిస రిస
నిసగరి మగపమగరి నీసనిస
పసరిస నిసరిస నిసరిస నిసరిస
పగరిగ రిగ రిగ రిపమగ మగరి సరిస
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri